Friday 15 March 2024

నిధిస్ గ్రాండ్ మా సీక్రెట్

 పెద్దల మాట పెరుగన్న మూట అని ఊరికే అనలేదు పెద్దల మాట నెలకు లక్షలాది రూపాయల ఆదాయాన్ని అర్జించే పెద్ద వ్యాపార సూత్రం గా మారిపోయింది

ముంబై కి చెందిన రజని నిధి గ్రాండ్ మా సీక్రెట్ పేరుతో సరదాగా ప్రారంభించిన హోం మేడ్ హెయిర్ ఆయిల్ బిజినెస్ సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు ఉద్యోగంలో వచ్చే జీతం కన్నా ఎన్నో రెట్లు ఎక్కువ ఆదాయాన్ని చేకూర్తుంది దీనిని బట్టి ఏదైనా పాతకాలంనాటి కబుర్లు చెప్పిన పాత పద్ధతులు పాటించిన అంతా పాత చింతకాయ పచ్చడిలే అని తేలిగ్గా తీసేసేవారు ఇకపై ఆచితూచి మాట్లాడాలేమో ఎందుకంటే అప్పటి పాత ఫారం లోనే కదా ఇప్పుడు సక్సెస్ సూత్రంగా మారిపోయింది నిధి రొటేజాకి ఆదివారం సెలవును అమ్మమ్మ ఇంటిలో సరదాగా గడపడం అలవాటు నిధి అమ్మమ్మ రకరకాల ఔషధ మూలికలను మేళ నుంచి ఒక విధమైన తలను నేను తయారు చేసేది అలా ఆమె సొంతంగా తయారు చేసిన ఆయిల్ తో నిధి తలకు మర్దన చేసి కాసేపటి తర్వాత తలస్నానం చేయించేది అమ్మమ్మ చేతిలోనే మహత్యం వల్ల నిదికి తోటి విద్యార్థులు అందరూ కోళ్లుకునేంత నల్లటి ఉత్తమ కేశ నిధి ఉండేది.

చదువు తర్వాత అమ్మమ్మ ఊరికి వెళ్లడం బాగా తగ్గిపోయింది ఇంతలో దేశాన్ని అంతటినీ కుదిపేస్తున్న కోవిడ్ మహామారి గురుగ్రామం కూడా వదలలేదు అక్కడే ఉన్న నిధిని కూడా అసలు వదలలేదు ఫలితంగా నీది జుట్టు కుచ్చులు కుచ్చులుగా ఊడడం మొదలు పెట్టింది క్రమంగా ఆమెను ఇతరులు ఎవరూ పోల్చుకోలేనట్లు తయారైంది అది చూసిన నిధి తల్లికి చాలా బాధ వేసింది

తన అమ్మ నుంచి ఆ నూనె తయారీ ఫార్ములా అని తెలుసుకొని తన అత్తగారు ఈ విషయంలో ఏమైనా సహాయం చేయగలరా అని అడిగింది కోడలు చెప్పిన ఫార్ములాను ప్రయత్నించింది అత్తగారైన రజని ఎట్టకేలకు తయారైన ఆ ఆయిల్ ను నిధి తలకు రాసి మర్దన చేయడం మొదలుపెట్టారు ఆ అత్త కోడలు ఆశ్చర్యం కొద్ది రోజుల్లోనే ఆ నూనె మంచి ఫలితాలను ఇచ్చింది పోయిన జుట్టు స్థానంలో కొత్త జుట్టు రావడం మొదలైంది ఆమె ఉంటున్న అపార్ట్మెంట్లోని ఇతర ఫ్లాట్ల వాళ్ళు అది గమనించి ఎలా సాధ్యమైంది ఇదంతా అని అడిగి విషయాన్ని తెలుసుకున్నారు తమకు కూడా అలాంటి ఆయిల్ తయారు చేసే ఇమ్మని అడగడమే కాదు అడ్వాన్సుగా కొంత మొత్తాన్ని చేతిలో పెట్టడం మొదలుపెట్టారు ఇదేదో బాగుంది అనిపించింది నిధికి దాంతో తన నానమ్మ రజిని సహాయంతో అమ్మ సహకారంతో ఆయిల్ తయారీ ఆరంభించింది వీరి ఆయిల్ గురించి ఆ నోట ఈ నోట కాదు కొన్ని డజన్ల వాట్సాప్ గ్రూప్ లలో పడి మొదట్లో కొద్ది లీటర్లకే పరిమితమైన ఆయిల్ తయారీ పెద్ద ఎత్తున తయారు చేయాలన్న నిర్ణయం తీసుకునేలా చేసింది

దాంతో గత సంవత్సరం మార్చిలో నిధి రజినీ దువా కలిసి నితీష్ గ్రాండ్ మా సీక్రెట్ పేరుతో ఒకసారి కొత్త ఆయిల్ బ్రాండ్ ఉత్పత్తిని ప్రారంభించారు ఫలితంగా అందరి చుట్టూ పెరగడం మాట ఎలా ఉన్నా వీరి ఆదాయం మాత్రం ఇబ్బడి ముబ్బడిగా పెరిగింది ఇప్పుడు నీది రజిని తయారు చేస్తున్న ఈ ఆయిల్ 67 వేల ఇళ్లకు చేరింది నెలకు లక్ష బాటిల్ల తయారీతో నెలకు సుమారు 50 లక్షల రూపాయల ఆదాయాన్ని అర్జించిపెడుతోంది అమ్మమ్మ ఫార్ములా ప్రకారం ఇప్పుడు నిధి ఆమెతోపాటు ఆమె నానమ్మ గారు స్వచ్ఛమైన కొబ్బరినూనెలో 13 రకాల వనమూలికల కలగలుపుతో పెద్ద ఇనుప మూకుడులో కొన్ని గంటల పాటు మరగబెడుతూ కలుపుతూ తయారు చేసిన ఈ హోం మేడ్ ఆయిల్ ఇప్పుడు పెద్దపెద్ద యంత్రాలతో లక్షల బాటిల్ల తయారీ లక్ష్యాన్ని చేరుకుంది పాతకాలంనాటి ఫార్ములాను తేలికగా చూసేవాళ్ళు ఇకనైనా ఇలాంటి విద్యను అందిపుచ్చుకుంటే ఎవరి కాళ్ళ మీద వాళ్ళు  నిలబడడం సాధ్యమవుతుంది



Thursday 15 February 2024

గిరిజన గూడెంలో తొలి మహిళా జడ్జి

 


తమిళనాడు జిల్లా తిరుపతూరు జిల్లా ఎలగిరి హిల్స్ కు చెందిన 23 ఏళ్ల గిరిజనురాలు వి శ్రీపతి సివిల్ జడ్జిగా అర్హత పొంది చరిత్ర సృష్టించారు సాధించారు ఇప్పటివరకు తమిళనాడులో గిరిజన మహిళా జడ్జి లేరు శ్రీపతి పరిచయం

ఆరు నెలల క్రితం తమిళనాడు తిరుపతూరు జిల్లాలోని ఎలా గిరి హిల్స్ నుంచి ఒక కారు చెన్నైకి బయలుదేరింది 4:30 గంటల ప్రయాణం లోపల ఉన్నది పచ్చి బాలింత అంతకు ముందు రోజే ఆమెకు ప్రసవమయ్యా ఆడపిల్ల పుట్టింది కానీ మరుసటి రోజు చెన్నైలో తమిళనాడు పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్ ఉంది అందులో ఉత్తీర్ణత సాధిస్తే ఆమె సివిల్ జడ్జి పోస్టుగా అర్హత సాధిస్తుంది అందుకే ప్రయాణం చేస్తోంది ఆమె పేరు వి శ్రీపతి వైయస్ 23 ఆమెకు తోడుగా ఉన్నది భర్త వెంకటేష్ తండ్రి కలియప్పన్ కొండ ప్రాంతంలో పోడు వ్యవసాయం చేసుకొని తరతరాలుగా బతుకుతున్న మలయాళీ తెగలు ఆడపిల్లలు చదువుకోవడం చాలా విశేషం లా చేయడం ఇంకా విశేషం సివిల్ జడ్జి కావడం అంటే చరిత్ర

చురుకైన అమ్మాయి తిరువన్నామలై లోని గిరిజన గూడెంలో కలియప్పన్ అనే మలయాళీ రైతుకు తొలి కుమార్తెగా జన్మించిన శ్రీపతి పసిపాపగానే చురుగ్గా ఉండేది తిరువన్నామలై గిరిజన గ్రామాల్లో చదువు సరిగ్గా లేదు వీళ్ళ గూడెం నుంచి బస్సు ఎక్కాలంటే 15 కిలోమీటర్లు నడవాలి అందుకే కుమార్తె చదువు కోసం కలియప్పను అక్కడి నుంచి 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎలగిరి హిల్స్ తిరుపతి జిల్లాకు మక్కా మార్చాడు ఇక్కడ కొండల్లో వ్యవసాయమే అయినా వీళ్ళుండే అత్తనాపూర్లో ఇంటర్ వరకు చదివించే మిషనరీ స్కూల్ ఉంది అక్కడే శ్రీపతి ఇంటర్ వరకు చదువుకుంది ఇప్పుడు చదివి ఏం చేయాలంట అని తోటి వారు తండ్రిని తల్లిని ప్రశ్నించి ఇబ్బంది పెట్టిన వాళ్ళు తమ కుమార్తె చదవాల్సిందేనని ప్రోత్సహించారు గిరిజనుల హక్కుల కోసం మా గిరిజనులకు ఎలాంటి చట్టబద్ధమైన హక్కులు ఉన్నాయో మా వాళ్లకు తెలియదు వారిని చైతన్యవంతం చేయాలి వారి హక్కుల వారు పొందేలా చేయాలి అందుకే లా చదవాలని నిశ్చయించుకున్నాను అందు శ్రీపతి ఇంటర్లో మంచి మార్కులు రావడంతో ఐదేళ్ల లా కోర్సులో చేరింది చదువు సాగుతుండగానే అంబులెన్స్ డ్రైవర్గా పనిచేసే వెంకటేశం తో వివాహం జరిగింది. చదువు పూర్తయ్యాక సివిల్ జాడ్చే పోస్ట్ కోసం టిఎస్పిఎస్సి పరీక్ష రాసిన సమయానికి నిండు చూడాలి అయినప్పటికీ బిడ్డకు జన్మనిచ్చి పరీక్ష రాసింది ఇప్పుడు రిజల్ట్స్ వచ్చే సివిల్ జడ్జిగా పోస్ట్ వచ్చింది. ఈ సంగతిని ప్రస్తావిస్తూ తమిళనాడు సీఎం స్టాలిన్ తమిళ సినీ ప్రముఖులు అభినందనలు తెలియజేశారు తమిళ మీడియంలో చదువుకున్న వారికి ఉద్యోగాల్లో అవకాశం కల్పించే విధంగా ద్రవిడ మోడల్ ను ప్రవేశ పెట్టడం వల్ల శ్రీపతి సివిల్ జడ్జి కాగలిగిందని ఇలా మారుమూల ప్రాంతాల వారికి అవకాశం తగ్గాలని  ఆకాంక్ష వ్యక్తం చేశారు