Saturday 28 April 2012

IN THE LAST DAYS OF TANGUTURI PRAKASAM PANTHULU



Tanగుటూరి ప్రకాశం పంతులుగారు ఆంధ్రుల
అభిమాన నాయకుడు. ఆంధ్రకేసరిగా పిలు
చుకోబడిన వ్యక్తి. సంయుక్త మద్రాసు రాష్ట్రానికి ముఖ్య
మంత్రిగా పనిచేశారు. తెలుగువారి తొలి రాష్ట్రం ఆంధ్రకు
తొలి ముఖ్యమంత్రి టంగుటూరి.
జవహర్‌లాల్ నెహ్రూతో సహా ఎవ్వరితోనైనా అవసర
మైతే ఢీ కొనటానికి వెనకాడనివాడు. బారిష్టర్ గా ఆ
రోజుల్లోనే లక్షలాది రూపాయల్ని ఆర్జిస్తున్న ప్రకాశం దేశ
స్వాతంత్ర్యం సర్వం త్యాగంచేశారు.
చెన్నపట్నం, రాజమండ్రి, ఒంగోలులో భవంతులు
నిర్మించుకుని ఆ రోజుల్లోనే ఖరీదైన కార్లలో తిరిగినవాడు.
ఆంధ్రులకు ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాటం చేసి తీర్మా
నం చేయించి కర్నూలు రాజధానిగా రాష్ట్రాన్ని సాధించి
ముఖ్యమంత్రి పదవీ బాధ్యతలు చేపట్టారు.
కాంగ్రెస్ ని వీడి ప్రజా పార్టీ పెట్టి సీట్లు గెలుచుకుని
కాంగ్రెస్ తో కలిసి సంకీర్ణ
ప్రభుత్వం ఏర్పాటుచేశాడు.
ఆయన నిర్ణయాలు తీసుకునే సాహసి.
ఇలా ముఖ్యమంత్రి అవగానే అలా కృష్ణా బ్యారేజ్
నిర్మాణం చేపట్టారు. అటు తిరుపతిలో శ్రీ వేంకటేశ్వర
విశ్వవిద్యాలయాన్ని ప్రారంభించారు.

కొందరు నాయకులను, కాంగ్రెస్ అధిష్టానం దగ్గరికి
తీసింది. ప్రకాశం పంతులుకు ప్రజలలో వున్న పలుకుబడి
తెలుసు కాబట్టి ఆయనతో ప్రత్యక్షంగా పోరాటం చేసే
సాహసం కాంగ్రెస్ నాయకులకు లేదు. అయినా ప్రకాశంని
ముఖ్యమంత్రిగా కొనసాగించడం ఇష్టం లేదు.
ప్రకాశం అంటే సి.రాజగోపాలాచారికి పడదు. రాజాజీ
చెప్పే పితూరీలలో జవహర్‌లాల్ నెహ్రూ ప్రకాశం మీద
కసి పెంచుకున్నారు. ఫలితం 1953 అక్టోబరులో ఏర్పడిన
ఆంధ్రరాష్ట్ర తొలి మంత్రివర్గం నవంబరు 1954 నాటికి
పతనమైంది. ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పై
అవిశ్వాస తీర్మానం నెగ్గింది.
అది కుట్రపూరితంగా నెగ్గించిన తీర్మానమని అంద
రికీ తెలుసు. రాజ్యాంగబద్ధత లేని స్పీకర్ చర్య. అయినా
సరే ప్రకాశం పంతులు తన రాజీనామా సమర్పించి పదని
నుండి తప్పుకొనగా రాష్ట్రపతి పాలన వచ్చింది.
ప్రకాశం పంతులుని తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి తెచ్చి
తన అధీనంలో పనిచేయించాలన్నది నెహ్రూ పట్టుదల.
అందుకు ప్రకాశంలోని
స్వాభిమానం అంగీకరించ
లేదు. ప్రజాపార్టీ, కాంగ్రెస్ 
పార్టీలు కలసి తిరిగి ఎన్నికల్లో gelichayi.
Appatiki అందరూ
తిరిగి ప్రకాశంగారే ముఖ్య 
మంత్రి కావాలనుకున్నారు.
కానీ కాంగ్రెస్ అధిష్ఠానవర్గం
ప్రకాశంని భరించే స్థితిలో లేదు. నాటి కాంగ్రెస్ అధ్యక్షులు
చేబర్, లాల్ బహదూర్ శాస్త్రీలు స్వయంగా
విజయవాడ వచ్చి ప్రకాశంపంతులు ముఖ్య
మంత్రి అభ్యర్థి కాకుండా వుండేందుకు
వేయాల్సిన ఎత్తుగడలన్నీ వేశారు.
ప్రకాశం గారు ప్రజల మనిషి. ఒకవైపు తనకు వ్యతి
రేకంగా కాంగ్రెస్ ఎత్తుగడలు వేస్తున్నప్పటికీ ప్రజలు
- మద్దతుంటే అవుతాం. లేకుంటే లేదన్నంత ధీమాతో
విజయవాడ మండుటెండలో నెత్తిన తడిగుడ్డ వేసుకుని
సమీపంలోని పల్లెటూరికి ఒక ఎంక్వయిరీకి వెళ్ళారు.
అప్పటికి ప్రకాశం పంతులు గారి వయసు 83. ఆ ఎండ
లోనే వచ్చి గెస్ట్ హౌస్ లో నిద్రపోయారు.
కాంగ్రెస్ అధిష్టానం "ఆయన పెద్దవారయ్యారు కదా"
అని ప్రకాశంగారిని వదిలించు
కోవాలనుకున్నారు.

ప్రకాశంగారి స్థానంలో
గోపాలరెడ్డి గారిని ముఖ్య
మంత్రిగా ముందుగానే ప్రక
టించారు. ఆ విధంగా ప్రకాశం
గారికి చివరి రోజుల్లో ఆయన
ద్వారా ఎదిగినవారే రాజకీయ
ద్రోహం చేశారు.
1954 నాటికి కంటిచూపు
కొద్దిగా తగ్గింది. కాగితాలు
బాగా దగ్గర పెట్టుకుని గాని
చదవలేకపోయేవారు.
అంతకు ముందు ప్రకాశం
గారు రోజుకు రెండు గంటలు
నడిచేవారు. ఇప్పుడు పొద్దున పదినిమిషాలు, సాయంత్రం
పది నిమిషాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
మనిషి వెంట ఉంటే కాని పర్యటనలకు వెళ్ళలేని పరి
స్థితి. అయినా హైదరాబాద్, విజయవాడ, చెన్నపట్నాల
మధ్య పర్యటనలు చేస్తూనే వున్నారాయన.
ప్రకాశం గారికి ఇతరత్రా ఆదాయం లేదు. ఆస్తులు
ఒకదాని తర్వాత ఒకటి కరిగిపోయాయి. మద్రాసులో
స్వరాజ్య పత్రిక ప్రారంభించిన భవనాన్ని కోర్టు వేలంలో
కొన్నవారు, అదనంగా వచ్చిన డబ్బు ప్రకాశంగారికి ఇస్తా
మని అన్నారేగాని ఇవ్వలేదు. వయసు మీదపడినా కారు
ప్రయాణాలు చేయడం మానలేదు.
కొన్ని సందర్భాల్లో ఆయనకు కారులో పెట్రోలు
కొట్టించుకునే స్టోమత లేకుండా పోయింది. ఒకనాడు
దక్షిణ భారతదేశంలో ఒక వెలుగు వెలిగిన ఆంధ్రకేసరి
అవసానదశలో ఆర్థిక ఇబ్బందులెదుర్కొన్నాడు.
ఈలోగా తెలుగు వారందరూ కలలుకన్న ఆంధ్రప్రదేశ్
ఏర్పడింది. ఆంధ్రప్రదేశికి ప్రకాశం ముఖ్యమంత్రి అవుతారని ఆశించినవారికి
 కాంగ్రెస్ పార్టీ నిరాశనే మిగి ల్చింది. ప్రకాశంగారు ప్రజ
లతో మమేకమవుతూనే
ఉన్నారు. 1957 మే నెలలో తీవ్ర ఎండలలో ఒంగోలుప్రాంతం పర్యటనకెళ్ళాడు.
 ఆయనకు వడదెబ్బ తగిలింది.

HYD cherina tharవాత కూడా ఆయన వడదెబ్బ నుండి కోలుకోలేదు.
వయసుతో వచ్చిన అనారోగ్యానికి ఎండదెబ్బ తోడనగా
ఉస్మానియా ఆసుపత్రిలో చేరక తప్పలేదు.
ఆసుపత్రిలో వున్న ప్రకాశంగారికి 18 రోజుల
చికిత్స తర్వాత ఆక్సిజన్ పెట్టాలన్నారు వైద్యులు. కాని
ఆయన అంగీకరించలేదు. ప్రకృతి చికిత్సను నమ్మిన
వాడు కాబట్టి కృత్రిమంగా ప్రాణవాయువు పీల్చడమా,
కాదు పొమ్మన్నారు. ఆయన మాటను కాదని ఆక్సిజన్
పెట్టే సాహసం వైద్యులు చెయ్యలేదు.
అప్పటికి ఆసుపత్రిలో చేరి ఇరవై రోజులు. ఆయన
ఆరోగ్యం ఏమాత్రం మారలేదు. కళ్ళు మూతలుపడు
తున్నాయి. ఆయన మిత్రులు వైద్యులచేత ఆక్సిజన్
ఏర్పాటుచేయించారు. దానిని వద్దనలేని పరిస్థితి ఆయ
నది. ఆక్సిజన్ పెట్టినా ఆయన
పరిస్థితిలో మార్పు రాలేదు.
కఫం కమ్ముకుని వచ్చింది.
ఊపిరితిత్తులు వ్యాధిపూరిత
మయ్యాయి.
సాయంకాల సమయంలో
కొడుకు, కోడలు, మనుమలు,
మనుమరాళ్ళు ఆయన ఆవ
స్థను చూసి బాధపడుతున్నారు.
వైద్యనిపుణులు ఆయన
ప్రాణం కాపాడేందుకు తమ
వంతు కృషి చేస్తున్నారు.
అంతకు కొద్దిసేపు ముందు
తనను తప్పించి అధిష్ఠానం
అండతో ఆంధ్రరాష్ట్ర ముఖ్య
మంత్రి అయిన గోపాలరెడ్డిగారు చూసేందుకు వచ్చారు.
ఆ విషయం ఆయన గమనించే స్థితిలో లేడు. అయినా
కొడుకు వారి రాకను చెవిలో చెప్పేసరికి కళ్ళు సగం
తెరిచి ఏదో చెప్పేందుకు ప్రయత్నించారు. కాని మాటలు
బయటకు రాలేదు. కళ్ళు మూతలుపడ్డాయి.
రాత్రి 7 గంటల 35 నిమిషాలకు ప్రకాశం ఆత్మ
జ్యోతి ఈశ్వరజ్యోతిలో కలిసిపోయింది. జీవితకాలంలో
విశ్రాంతి అన్న మాట వినటానికి కూడా సహించని నాయ
కుడు సుదీర్ఘ విశ్రాంతిలోకి వెళ్ళిపోయాడు.
“చెన్నపట్నంలో సైమన్ కమిషన్ బహిష్కరణ ఉద్యమ
సమయంలో ఎక్కు పెట్టిన పోలీసు తుపాకీకి పేల్చు
కోండని ఛాతీ చూపించిన సాహసి ప్రకాశం.
ఆయన సర్వస్వం స్వాతంత్ర్య సమరానికి త్యాగం
చేశాడు. ప్రముఖ న్యాయవాదిగా గొప్ప ఆస్తి సంపాదిం
చాడు. కాని నిన్న ఆయన మరణించేనాటికి ఒక రాగి
పాత్ర అయినా ఆయన దగ్గర మిగలలేదు" అంటూ
నాటి లోకసభ స్పీకర్ మాడభూషి అనంతశయనం
ఆయ్యంగారు నివాళులు అర్పించారు.
రాజకీయాలు ప్రజాసేవకోసం అని భావించిన తరం
వాడు ప్రకాశం. అందుకే ఆయన ఆస్తులను పోగొట్టుకు
న్నాడే కాని రాజకీయాలలో సంపాదించలేదు. ఆయన
చివరి రోజుల్లో ఆర్థికంగా ఇబ్బందులు పడ్డారు.
నా అనుకున్న వారి దగ్గర చనువుగా డబ్బు తీసేసుకునే
వారట.ఆలా తీసుకున్నదానిలోనే కొంత ఆవసరాల్లో వున్న
వారికిచ్చేసేవారు. అధికారం వున్నా లేకున్నా ఆయన ఆంధ్ర
కేసరి. తనకంటూ ఏమీ మిగుల్చుకోలేదు ప్రజాభిమానం
• తప్ప. అదే ఆయన మహోదార్యం.

Thursday 26 April 2012

THE LAST DAYS OF ACTOR SHOBHAN BABU



teలుగు సినీరంగంలో 'సోగ్గాడు' శోభన్బాబు, సినీ
రంగం మీద మమకారంతో చెన్నపట్నం చేరిన
చాలామందిలాగానే కాళ్ళు అరిగేలా సినిమా స్టూడియోల
చుట్టూ తిరిగినవాడు. ఒక అవకాశంరాగానే దానిని అంటి
పుచ్చుకుని, సినీరంగంలో స్థిరపడి నటనలో కన్నా పంపు
దలో ఆకాశమంత ఎత్తుకు ఎదిగిన హీరో.
నిజజీవితంలో మనం ప్రతి ఒక్కరి నుండి ఏదో ఒకటి
నేర్చుకోవచ్చు. కొందరి జీవితాలు చూసి ఎలా జీవించాలో
తెలుసుకుంటే, మరికొందరి జీవితాలు చూసి ఎలా
బతకకూడదో తెలుసుకోవచ్చు,
శోభన్బాబు రెండవ సూత్రాన్ని బాగా వంటపట్టించు
కున్నాడు. తన ముందు తరం నటులనుండి నటన ఎంత
నేర్చుకున్నాడో కాని ఆర్థిక వ్యవహారాలలో ఎలా వ్యవహ
రించాలో మాత్రం బాగా నేర్చుకున్నాడు.
లక్షలాది రూపాయలు రెమ్యునరేషన్ తీసుకుంటూ,
కోట్లాది రూపాయల ఆస్తులు కూడగట్టుకుని కూడా
వాటిని ఎలా కాపాడుకోవాలో తెలియక చందాలు వేసు
కుని శవయాత్ర జరిపించుకున్న నటులున్నారు.
తన అందచందాలు శాశ్వతమనుకుని, ఆ అందచందా
లను చూసి వశమయ్యే అమ్మాయిల మత్తులో తేలియాడి
జీవితం నరకం చేసుకున్న తన సాటి హీరోని చూశాడు.
నటనలో ఒక స్థాయికి చేది, తను సంపాదించినది తిరిగి
సొంత సినిమాల మీద పెట్టి చేతులు కాల్చుకున్న వారిని
చూశాడు. అందుకే శోభన్బాబు జీవితం భిన్నంగా
సాగింది. ఒక బరి తీసుకుని జీవించాడు.
నటన తన వృత్తి. తన నటనమీద పెట్టుబడి పెట్టి
డబ్బు చేసుకుంటున్నారు నిర్మాతలు. కాబట్టి అందులో
తనకు రావాల్సిన డబ్బు తాను అందుకుంటున్నాడు.
అందులో తప్పు ఏమీ లేదు. అదీ ఆయన సినీరంగంలో
మూడున్నర దశాబ్దాలు పాటించిన సూత్రం.
సంపాదించిన డబ్బు తనకు తప్పించి మరెవరికీ
చెందదు. ఇప్పుడు మనం ఎవరికైనా అందించినా తిరిగి
కష్టాలలో ఉన్నప్పుడు వెనక్కి తిరిగి ఇస్తారనే నమ్మకం
లేదు. అందుకే శోభన్బాబు తన సంపద మొత్తాన్ని
తోటలు, స్థలాలు, భవనాల మీద పెట్టాడు.
మద్రాసు నగరంలో 50 బిల్డింగులు కలిగివుండట
మంటే మాటలు కాదు. బహుశా సినీరంగంలో అందరి
కన్నా సంపద కలిగిన వ్యక్తి శోభన్ బాబేనేమో!
తెలుగు సినీరంగం హైదరాబాద్ కి తరలివెళుతున్న
ప్పుడు మద్రాసు వదిలి రాలేని పరిస్థితి.
ఫలితంగా శోభన్ బాబు నెమ్మదిగా ఒంటరివాడనడం
మొదలైంది. కొత్త దర్శకులు, కొత్త కథనాలు, కొత్త
హీరోలు... ఇక తనకు అవకాశాలు తగ్గడం సహజం అనే
విషయం చాలా ముందుగా గుర్తించాడు.
ఇంతకాలం నిర్మాతలు క్యూ కట్టి పాత్రలు ఇచ్చిన
పరిశ్రమలో హీరో కాని పాత్రకోసం నిర్మాతలను ఆడగ
టానికి ఆయనకి అహం అడ్డు వచ్చింది. అందుకే 1996
జనవరి 1న తన సినీరంగ రిటైర్మెంట్ ప్రకటించాడు.
ఆ తర్వాత ఆయన మళ్ళీ ఎందరు ఎంతగా ఆశ పెట్టినా
ముఖానికి రంగు వేసుకోలేదు.
అప్పటినుండి ఆయన చివరిరోజులు అనుకుంటే
దానిని మొదటి ఐదు సంవత్సరాలు ఒక రకంగా, ఆ
తర్వాత ఏడేళ్ళు మరో రకంగా సాగించాడు.
1996 తర్వాత సినిమాలలో నటించడం మానేసినా
బహిరంగంగా కనిపించడం ఆపలేదు. కారు నడపడం
బాగా ఇష్టపడే శోభన్బాబు తనే సొంతంగా డ్రైవ్ చేసు
కుంటూ తన బిల్డింగ్ ను ఒకసారి అలా చూసుకుని
సంతోషపడి వస్తుండేవారు. తాను సంపాదించుకున్న
ఆస్తుల మీదకన్నా తనకు భగవంతుడు ఇచ్చిన రూపం
మీద,
దానిని సినీరంగంలో మలచుకున్న అందచందాల
మీద మక్కువ ఎక్కువ
శోభన్బాబుకి,
ముసలివాడివవు-సినిమా షూటింగ్ శోభన్బాబు అంగీ
లప్పుడు మేకప్ జాగ్రత్తలు | తర్వాత ఇల్లు
వదిలి
నిర్మాతలు, సినీరంగ నిప్పు
నలుగురికి కనిపించ
ణులు చూసుకునేవారు.
కాని ఇప్పుడు ఆయన
కాదు. వయసుతో
తనకు తాను స్వయంగా | మార్పుల్ని అంగీకరి-
చూసుకోవాల్సివచ్చింది.
ఆయనకు అల
ఆయన గ్లామర్ మీద
ఆయనకెంతో నమ్మకం. ఒకింత గర్వం కూడా. ఆ గ్లామర్
తోనే ఆయనకు గుర్తింపు, గ్లామర్ పోతే గుర్తింపు ఎక్కడ
పోతుందోనన్న భయం వెంటాడేది. ఐదేళ్ళ పాటు తన
గ్లామర్ సొంత ఖర్చుతో భరించుకుంటూ వచ్చినా
2001లో ఒక ఫంక్షన్ లో ఒకామె పెద్దవారైపోతున్నారనడం
శోభన్బాబు గ్లామర్ అహానికి పెద్దదెబ్బ తగిలింది.
శోభన్ బాబుకి ఒంటరితనం ఇష్టం. పరిమితమైన
స్నేహాలు. అందుకే ఆ ఆతిదగ్గరి స్నేహితులతో మద్రాసు
వీధుల్లో డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్ళి నగరంలోని స్టెర్లింగ్
రోడ్ లోవున్న స్టేటస్ కో బిల్డింగ్ పైకి చేరి చుట్టూ కని
పించే మద్రాసు
నగరాన్ని విద్యుత్ కాంతుల్లో వీక్షిస్తూ తన
కిష్టమయిన సినిమా పాటలు వింటూ అద్వితీయమైన
అనుభూతిని ఆస్వాదించేవాడు.
ముసలివాడివవుతున్నావనే కామెంట్ ని కోభన్ బాబు
అంగీకరించలేక 2001 తర్వాత ఇల్లు వదిలి రావడం మానే
శాడు. నలుగురికి కనిపించడానికి ఇష్టపడేవారు కాదు.
వయసుతో ముఖంలో వచ్చిన మార్పులను అంగికరం
చలేని మనస్తత్వం ఆయనకు ఆలవడిందన్నారు.
ఏడుపదుల వయసులో ముడుతలు పడిన ముఖం,
బట్టతలతో పదిమందిలోకి వెళితే తన రూపం చూసిన
అభిమానులు జీర్ణించుకోలేరని శోభన్ బాబు వివరించి
చెప్పేవాడు. వాస్తవానికి ఆయనలో వచ్చిన మార్పును
ఆయనే అంగీకరించలేకపోయాడు.
చివరి రోజుల్లో శోభన్బాబులో అపరాధభావం ఏర్పడిం
దేమో! సినీపరిశ్రమ నుండి డబ్బు తీసుకోవడమే తప్పించి
సినీ ఇండస్ట్రీకి ఆయన చేసిందేమీ లేదన్న ఆలోచన
కలిగింది. తనను ఎవరూ గుర్తు పెట్టుకోలేమో!
పరిశ్రమలో ఎవరికీ సహాయం చేయలేదు. సహాయ
పడేలా సినిమాలు తీయలేదు. స్టూడియోలు పెట్టలేదు.
ఏ రాజకీయ పార్టీలతో సంబంధం లేదు. అసలు ఒక్క
సారికూడా ఓటు వెయ్యలేదు.
డబ్బు పై వ్యామోహం పెంచుకుని సంపాదనే ధ్యేయంగా
బతికిన తనను ఎవరైనా ఎందుకు ఆదరించాలన్న ప్రశ్న
ఆయన మనసును చివరిరోజుల్లో తొలిచివేసింది.
శోభన్ బాబుకి సంపదకి కొదవలేదు. చాలామంది
సినిమానటులకుండే వ్యసనాలు లేవు. చక్కని ఆరోగ్యం.
కుటుంబపరంగా ఒడుదుడుకులు లేవు. సంతానాన్ని
సినీరంగంలోకి తీసుకురాలేదు. తెచ్చి వారు సరిగా స్థిర
పడకపోతే బాధ. స్టూడియోలకు దూరంగా ఆస్తులను
కాపాడుకునే బాధ్యతలు అప్పగించాడు.
తాను డబ్బుమనిషి అని, తనని పిసినారి అని ఫిల్మ్
ఇండస్ట్రీ భావించిందని తెలుసు. అందుకేనేమో తెలుగు
చలనచిత్ర పరిశ్రమ 75 ఏళ్ళ ప్లాటినమ్ ఉత్సవానికి
ప్రత్యేకంగా పిలిచినా రాలేదు. పైగా శోభన్
బాబు ఎవరినీ
కలవడం లేదని, గది దాటి
బయటకు రావడం లేదని
తన 72 ఏళ్ళ రూపాన్నిచూపించేందుకు ఇష్టం
లేనట్టుగా ప్రవర్తిస్తున్నా
డని, అదో రకమైన మాన
సిక ఇబ్బందన్న వార్తలు
గుప్పుమన్నాయి.
శోభన్బాబుకు ప్రతి
రోజూ హిందూదినపత్రిక
చదవడం అలవాటు. యోగా చేసి, మల్లెపూల వంటి తెల్ల
డ్రెస్ వేసుకుని రాకింగ్ ఛైర్ లో ఊగుతూ తన ఇంటిలో
కూర్చోవడం ఆయనకు ఇష్టమైన దినచర్య.
కాని ఫిబ్రవరిలో శోభన్బాబు చెల్లి ఝాన్సీ మరణించి
నప్పటినుండి ఏదో నలత. ఏడుపు ఆపుకోలేకపోయాడు.
ఆది ఆమెమీద ప్రేమో లేక తానూ వయసు మీదపడి
మరణానికి దగ్గరవుతున్నాననే భయమో!
తనకు తానుగా ధైర్యం చెప్పుకోవడం మొదలెట్టాడు.
నాకేమీ కాదు మరో 20 ఏళ్ళు. 50 ఏళ్ళు. 70 ఏళ్ళు....
హాయిగా బతుకుతా! అని. కాని ఎక్కడో సందేహం. ఆ
సందేహమే నిజమయ్యింది.
రోజూ ఉదయంలాగానే తన కిష్టమైన రాకింగ్ చైర్ లో
కూర్చుని అల్పాహారానికై ఎదురుచూస్తున్న శోభన్బాబు
అలాగే కుప్పకూలి, కానరాని లోకాలకు వెళ్ళిపోయాడు.
శోభన్ అభిమానులు వందలాది నుంచి చెన్నై వెళ్ళి హోరున
వర్షం కురుస్తున్నా లెక్క చెయ్యక శాంతినికేతన్లో అంత్య
క్రియలయ్యేవరకు శోకతప్తులయ్యారు.

A YOUNG SUCCESSFUL RACER

SUCCESSFUL WOMAN CHEFS

CHANAKYA NEETHI


Wednesday 25 April 2012

LAST DAYS OF ACTRESS MADHUBALA



ఆమె అందంలానే ఆమె పేరూ అందమైనదే!
బాలనటిగా సినిమాల్లోకి ప్రవేశించిన మధుబాల
ఆ తర్వాత తన అందంతో, అభినయంతో ప్రేక్షకులను
ఆకట్టుకుంది.ఆమె చనిపోయిన రెండు దశాబ్దాల తర్వాత
1990లో ఓ సినిమా పత్రిక నిర్వహించిన బ్యాలెట్ లో
అత్యంత ప్రజాదరణ పొందిన ఏకైక హీరోయిన్ గా మధు
బాల ఎంపికైంది. దటీజ్ మధుబాల.
డైరెక్టర్ కమల్ అమ్రోహి, నటుడు ప్రేమనాథ్, అశోక్
కుమార్, దిలీప్ కుమార్, కేదార్ శర్మ, జుల్ఫికర్ ఆలీ భుట్టో
లను ప్రేమించి, వారిచేత ప్రేమించబడి చివరికి గాయ
కుడు కిషోర్ కుమార్ కి పేరుకే భార్యగా మారి, ప్రేమాభి
మానాలకు నోచుకోలేక, అర్ధాంతరంగా 36 ఏళ్ళకే జీవి
తాన్ని ముగించేసిందంటే విధి ఎంత బలీయమో!!
తండ్రి అతుల్లాఖాన్ అంటే ఆమెకెంతో గౌరవం.
ఆయన పదకొండుమంది సంతానంలో మధుబాల ఐదవ
బిడ్డ. తండ్రి మాట జవదాటాలంటే ఆమెకు భయం. ఆ
భయమే ఆమె జీవితాన్ని విషాదాంతంలో ముంచింది.
మధుబాల అసలు పేరు ముంతాజ్ జాన్ బేగం.
ముద్దు పేరు మజిలీ అప్పా. మధుబాలకు చిన్నప్పుడే
గుండెజబ్బు ఉంది. ఆ జబ్బుందన్న సంగతి ఆమెకు
తెలీదు. ఆ విషయం ఆమె తండ్రి దాచాడు.
ప్రముఖ నటుడు దిలీప్ కుమార్ ప్రేమను గెలుచు
కున్నా తండ్రి వ్యతిరేకతతో అతన్ని దూరంచేసుకుంది.
ఇది ఆమె జీవితంలో పెద్ద విషాదం. లేకుంటే అతనికి
భార్య అయ్యేది. దిలీప్ అంటే ఆమెకెంతో ఇష్టం.
17 సంవత్సరాల వయసులో దిలీప్ కుమార్ సరసన
నటించింది. ఆమె అందానికి ముగ్ధుడైన దిలీప్ కుమార్
కూడా మధుబాలను ప్రేమించాడు. తండ్రి అతుల్లాఖానకు,
దిలీప్ కుమార్‌కు మధ్య మనస్ఫ
ర్థలు రావడంతో దిలీపు
దూరంకావలసి వచ్చింది.
దిలీపుమార్ను వదులు
కున్నాక తానెంత తప్పుచేశానో
అర్థంచేసుకుంది ఆమె. ప్రేమకు
దూరమై కృంగిపోయింది. మాన
సికంగా దెబ్బతింది. దాంతో ఆమె
ఆరోగ్యం క్రమేపీ క్షీణించింది.
అటువంటి సమయంలో
కె.ఎ.ఆసిఫ్ 'మొఘల్ ఎ ఆజమ్'
చిత్రంలో దిలీప్ కుమార్ పక్కన
నటించే అవకాశంవచ్చింది. కాద
నలేకపోయింది. కారణం ప్రియు
డితో నటించే అవకాశం రావడం
ఒకటైతే, అనార్కలి వంటి గొప్ప
పాత్ర లభించడం రెండు.
వెంటనే ఓ.కే. చేసింది.
కానీ ఆ సినిమా షూటింగ్
జరుగుతున్నంతకాలం మధు
బాల తండ్రి ఆమెకు కాపలాగా
వుండటంతో దిలీపుమారో
మాట్లాడలేకపోయింది.
ఆమె తండ్రి అలా తమని
మాట్లాడుకోనీకుండా జాగ్రత్తపడ
టంచూసి అతనికి ఇబ్బంది అని
పించి, తటస్థంగా వుండిపోయేసరికి ఇద్దరూ ఎడమొఖం
పెడముఖంగా ఉండిపోయారు.ఆ చిత్రం పూర్తయ్యేలోగా
ఆమె ఆరోగ్యం మరింత దెబ్బతింది. అనారోగ్యంవల్ల ఆమె
తూలిపోతూండేది. ఆఖరి సీ లో నటించేప్పుడు సంకెళ్ళ
వల్ల చేతులకు, కాళ్ళకు గాయాలయ్యాయి.ఆమె ప్రేమే ఆమెకు
శత్రువైంది. ఏ ఒక్కరితోటి
ప్రేమ సక్సెస్ అవ్వక కృంగి
పోయింది. ఆ సమయంలో
కిషోర్‌కుమార్ గాయకుడిగా
పరిచయమై, అప్పుడప్పుడే
పైకొస్తున్నాడు.
అతన్ని వివాహం చేసు
కుంటే తనకో తోడు దొరు
కుతుంది అనుకుంది. ఆ

సమయంలో అప్పుల్లో మునిగివున్న కిషోర్ కుమార్ మధు
బాల అడగ్గానే ఆనందంగా ఒప్పుకున్నాడు.ఆమెను వివా
హం చేసుకున్నాడు. మధుబాలవల్ల అప్పుల ఊబిలోంచి
బైటపడ్డాడు.
కానీ ఆమె అంటే అతనికెంతమాత్రం ప్రేమ
లేదు. దాంతో ఇద్దరి మధ్య ఘర్షణలొచ్చాయి.
చివరికి అనారోగ్యంతో 1960ల్లో తన నట జీవితా
నికి స్వస్తి చెప్పింది. ఇంత చేస్తే అప్పటికి ఆమె వయసు
28 సంవత్సరాలే. గుండెజబ్బు తీవ్రమవడంతో మెరుగైన
చికిత్సకోసం ఇంగ్లండ్ కు వెళ్ళింది.ఆమె పరిస్థితిని చూసిన
డాక్టర్లు పెదవి విరిచారు. గుండె ఆపరేషన్‌కు తట్టుకోలేదని
స్థిరనిశ్చయానికి వచ్చారు. అదే చెప్పారు.
.
తిరిగి మాతృదేశం చేరుకుంది మధుబాల.
'ఆరాధన' సినిమా 1969లో విడుదలైంది.ఆ చిత్రంలో
కిషోర్‌కుమార్పడిన పాటలకు దేశమంతా ఉర్రూతలూగి
పోయింది. గాయకుడిగా డిమాండ్ పెరిగింది. ఆఫర్స్
ఇబ్బడి ముబ్బడిగా వచ్చిపడ్డాయి. ఆర్థికంగా కుదుట
పడ్డాడు. మధుబాలను నిర్లక్ష్యం చేశాడు.
.
ఏ ఒక్కరి ప్రేమా దక్కక చివరి రోజుల్లో అల్లాడి
పోయింది మధుబాల. కనీసం నోరారా పలకరించే మనిషే
లేడు. అప్పుడప్పుడు వచ్చి పలకరించే తన పుట్టింటివారు,
ఒకరిద్దరు సన్నిహితులు తప్ప ఇంకెవరూ వచ్చేవారు
కాదు. ఒంటరిగా వున్న సమయంలో తన ప్రేమికుల
గురించే ఎప్పుడూ ఆలోచిస్తూ వుండిపోయేది.
మధుబాల ఢిల్లీ నగరంలో వుండగా, ఇంకా ఆమె
అప్పటికి ముంబై చేరలేదు. సినిమాల్లోకి రాలేదు. ఆ
రోజుల్లో ఆమెకు లతీఫ్ అనే ఫ్రెండ్ వుండేవాడు. ఆమె
వస్తూవస్తూ అతనికో గులాబీపువ్వు ఇచ్చింది.చివరి రోజుల్లో
ఆమెకు అతను తరచుగా గుర్తిస్తుండేవాడు.
కేదార్ శర్మ, కమల్ అమ్రోహి, ప్రేమ నాథ్, అశోక్
కుమార్, దిలీప్ కుమార్, జుల్ఫికర్ ఆలీ భుట్టో, కిషోర్
కుమార్ ఇలా వరుసగా వారంతా ఆమె చివరి రోజుల్లో
గుర్తుకురాసాగారు. తన డైరీలో వారందరి జ్ఞాపకాలను
రాస్తూ, బాధపడుతూ వుండేది.
ఆఖరి ఘడియలు వచ్చాయని ఆమెకు అర్థమయ్యే
సరికి తానెంతో గాఢంగా ప్రేమించిన దిలీపుమారు
కలవరించడం మొదలు పెట్టింది. ఒక్కసారి వచ్చి కలసి
వెళ్ళమని ఉత్తరాల ద్వారా ప్రాథేయపడింది. దిలీప్
రాలేదు. ఆమెను పూర్తిగా మరిచిపోయాడు.ఆమె అప
రాధాన్ని అతను క్షమించలేకపోయాడు.
అయితే కూతురి దుఃఖాన్ని చూసిన ఆమె తండ్రి
కరిగిపోయాడు. ఒక్కసారి వచ్చి చూసి వెళ్ళమని ప్రాధేయ
పడ్డా దిలీప్ కరగలేదు. ఆ విషయం తెలిస్తే మరింత
బాధపడుతుందని తండ్రి చెప్పలేదు. దాంతో తీరని వేద
నతో అనారోగ్యం నుండి కోలుకోలేకపోయింది. చివరి
వరకు దిలీప్ కోసమే
నగరంలో వుండగా, ఎదురుచూసింది.
-డ్ వుండేవాడు. అంత దుఃఖాన్ని ఆమె
అతనికో గులాబీ
గుండె మోయలేకపో
యింది. 1969 ఫిబ్రవరి
ఆమె మరణించాక
23వ తేదీన మధుబాల
విధుబాల ఇచ్చిన
తనువు చాలించింది. ఆమె
ఆమె సమాధిమీద మరణించినా అభిమానుల
అలర్పించాడు.
గుండెల్లో చిరస్థాయిగా
మిగిలేవుంది.
దిలీప్ కుమార్ ఆఖరి క్షణంలో శ్మశానానికైనా వస్తా
డనుకున్నారంతా. అతను రాలేదు. మధుబాల తండ్రి
ఆమె డైరీని కూడా సమాధిచేశాడు.
మధుబాల మరణించాక ఆమె బాల్యమిత్రుడు
లతీఫ్ తనకు మధుబాల ఇచ్చిన గులాబీ పువ్వును ఆమె
సమాధి మీద ఉంచి నివాళులర్పించాడు. ఆమె జ్ఞాపకంగా
దాచుకున్నాడా గులాబీ పువ్వు.
ఆమె మరణించేనాటికి లతీఫ్ ఓ ఐఏఎస్ అధికారి.
ప్రతి సంవత్సరం ఆమె చనిపోయిన రోజు ఆమె సమాధి
మీద ఓ గులాబీ పువ్వును వుంచి వెళ్తుంటాడు.
'ప్యార్ కియాతో డర్‌
జబ్ ప్యార్ కియాతో
డర్‌ క్యా' 'మొఘల్ ఎ ఆజమ్'లో మధుబాల నర్తిస్తూ
నటించిన ఆ పాట మన చెవుల్లో ఇప్పటికీ, ఎప్పటికీ విన
బడుతూనే ఉంటుంది.
మధుబాల ఢిల్లీ నగరంలో వుండగా,
లతీఫ్ అనే ఫ్రెండ్ వుండేవాడు.
ఆమె వస్తూవస్తూ అతనికో గులాబీ
పువ్వు ఇచ్చింది. ఆమె మరణించాక
లతీఫ్ తనకు మధుబాల ఇచ్చిన
గులాబీపువ్వును ఆమె సమాధిమీద
ఉంచి నివాళులర్పించాడు. 

Thursday 5 April 2012

LAST DAYS OF ACTRESS SAVITHRI



నటులు ఎందరో వుంటారు. కాని మహానటులు
ఒక్కరే వుంటారు. ఆ ఒకే ఒక్క మహానటి సావిత్రి.
జీవించింది నలభై ఏడేళ్ళే- అయితేనేం చిరస్థాయిగా
నిలిచే నటనా కీర్తి సంపాదించింది..
ఆమె సెట్లో ఉందంటే ఎస్.వి.రంగారావులాంటి
నటుడు కూడా నటన విషయంలో జాగ్రత్తగా ఉండాలి
అని మనసులో అనుకునేవాడట. సాటి నటీమణులకు
ఆమె అంటే ఎంతో గౌరవం, అభిమానం. ఆమెను తల
చుకుంటే చాలు నటన అదే వస్తుంది.
సావిత్రి తెలుగమ్మాయి అంటే తమిళులు నమ్మరు.
ఒక్క తమిళులే కాదు,ఆమె ఏ భాషలో నటిస్తే ఆ భాషను
అంత స్పష్టంగా, తన మాతృభాషలాగానే మాట్లాడగలి
గిన నేర్పు ఆమెది. రెండున్నర దశాబ్దాలపాటు తెలుగు,
తమిళ చలనచిత్రరంగంలో తిరుగులేని తారగా వెలు
గొందిన సావిత్రి చివరిరోజులు అంత బాధాకరంగా గడు
స్తాయని ఎవరూ అనుకుని వుండరు.
సినిమా నటులకు నటన తప్పించి నురేదీ చేతకాదు
అనుకుంటారు. కాని వారికీ మనసుంటుందని, అది
స్పందిస్తుందని తెలియదు. సావిత్రి మనసు ప్రేమను
కోరుకుంది. ప్రేమ పిచ్చిది అన్నమాట ఆమెకు బాగా
అతుకుతుంది. జెమినీ గణేశన్ని పిచ్చిగా ప్రేమించింది.
అతనికి అప్పటికే వివాహమైందని, అతనికి చాలామంది
తారలతో సంబంధాలున్నాయని తెలుసు.
ఆ విషయంలో ఆమెను హెచ్చరించనివారు లేరు.
ఐనా రహస్యంగా మైసూరు వెళ్ళి చాముండేశ్వరీదేవి సమ
క్షంలో పెళ్ళాడింది. అప్పటికి ఆమె వయసు రెండు పదు
ల్లోపే. ఆ వివాహమే ఆమె జీవితాన్ని మార్చివేసింది.
సావిత్రి సినీ కెరీర్ అద్భుతంగా ఉన్నప్పుడు జెమినీ
గణేశన్ ఆమె వెంటే వున్నాడు. తాను తాగుతూ సరదాగా
సావిత్రిని తాగమని అడిగాడు. అంతవరకు మందు
ముట్టని సావిత్రి తర్వాత జెమినీ గణేశన్ పుణ్యమా అని
మందు లేకుండా బతకలేని స్థితికి వచ్చింది.
ప్రతిరాత్రి మందు కావాలి. సినిమా అవకాశాలు తగ్గ
టంతో ఆదాయం తగ్గింది. అంతగా చదువుకోని సావిత్రి
అమాయకురాలు. ఆర్థికపరమైన లావాదేవీలు ఎలా నిర్వ
హించాలో తెలియదు. ఎవరినిపడితే వారిని నమ్మింది.
అవే ఆమెకు సమస్యలు తెచ్చి పెట్టాయి. సావిత్రి సంపాదన
మీద పెత్తనం చెలాయించాలను కున్న జెమినీ గణేశన్
చాలావరకు విజయం సాధించాడు. గుడ్డిగా తన ఆదాయ
మంతా భర్త చేతిలో పెట్టిందామె.
తెలుగులో వచ్చిన 'మూగమనసులు' సినిమా, అందులో
ఆమె పాత్రను ప్రేక్షకులు మరువలేరు. ఆ సినిమాను
తమిళంలో నిర్మించాలనుకుంది సావిత్రి. అందుకు
హీరోగా భర్తను ఎంపికచేసుకోవడం,దానిమీద భర్త అభ్యం
తరంతో ఆమె కష్టాలు మొదలయ్యాయి. తన డబ్బు
తన ఆధీనంలో లేదన్న వాస్తవం తెలిసివచ్చింది.
సినిమా ఆగకూడదన్న పట్టుదలతో ఆ సినిమాను
పూర్తిచేసి విడుదల చేసింది. అంత చక్కని కథ కలిగిన
సినిమాను తమిళులు ఎందుకు తిరస్కరించారో తెలి
యదు. ఆర్థిక నష్టం, అప్పుల మీద వడ్డీలు. తన మాట
వినలేదన్న కోపంతో జెమినీ గణేశన్ ఇంటికి రావడం మానే
శాడు. ఎంతగానో ప్రేమించిన భర్త దూరమవడం ఆమె
ఆరోగ్యం మీద ప్రభావం చూపించాయి.
అధిక రక్తపోటు, షుగర్ జబ్బు వారి వంశంలో
వస్తున్న అనారోగ్యాలు. అవి రెండూ వున్నవారు తీసుకోవా
ల్సిన జాగ్రత్తలు సావిత్రి తీసుకోలేదు.
1971కల్లా సావిత్రి తాగుడుకు బానిస అయింది.
తాగుడు వద్దని దేవదాసుకు నీతిబోధ చేసిన ఈ సినీ
పార్వతి అదే తాగుడులో మునిగితేలింది. తాగుడు
తప్పించి తిండి తినదు. శరీరం, మనసు రెండూ పాడ
య్యాయి. సావిత్రి చుట్టూ వందిమాగధులు చేరి ఆమెను
ఉబ్బి తబ్బిబ్బు అయ్యేలా చేసేవారు.
ఆమెది మొదటి నుండి మహారాణి జీవితమే. మహా
రాణులు దానం చేసినట్టే తన దగ్గరున్నది అలా తీసి
ఇచ్చేది.
కాలం మారినా ఆమె అలవాటు మారలేదు. అడి
గినవారికి ఏదో ఒకటి ఇచ్చే అలవాటు పోలేదు.
ఇదంతా కూతురు, అల్లుడుకి నచ్చలేదు. ఆమె
వియ్యాలవారికీ నచ్చలేదు. వారు విధిస్తున్న ఆంక్షలకు
లోబడి బతకడం సావిత్రికి ఇష్టం లేదు. ఫలితంగా తాను,
మహారాణిలా బతికిన బంగళాను వదిలి కేవలం 500
రూపాయల అద్దెకు చెన్నపట్నంలోని అన్నానగర్ ప్రాంతా
నికి మారింది. ఆ చిన్న ఇంట్లోనే కొడుకుతో గడిపింది.
నాటివరకు సావిత్రి ఆదాయపుపన్ను సక్రమంగా
చెల్లించలేదు. దానిమీద నోటీసులు పంపించారు.
చాలాకాలం ఆ నోటీసులను పట్టించుకోలేనంత
మత్తులో ఉండిపోయింది. ఫలితం ఆదాయపుపన్ను
శాఖవారు వడ్డీల మీద వడ్డీలు లెక్కలు కట్టి లక్షలలో
బకాయి చూపించి కడతారా లేక ఆస్తులు జప్తు చేయ
మంటారా! అని బెదిరింపులు మొదలు పెట్టారు.
తాగుడు తనని పతనం చేసిందని ఆమె అర్థం చేసు
కుని, ఆ మత్తు బానిసత్వం నుండి బయటపడి మళ్ళీ
సినిమాలలో నటించడం మొదలు పెట్టింది.
ఆ మహానటిని దర్శకత్వం వహించే అదృష్టం కోసం
ఎదురుచూస్తున్న దర్శకులు ఆదరించారు. ఆమెతో
నటించే మహదావకాశం కోసం ఎదురుచూసే నటులు
పొంగిపోయారు.
కాని పీక్కుపోయిన ఆమె ముఖం చూసి
ప్రేక్షకులు మాత్రం కంటతడి పెట్టారు.
ఒక కన్నడ షూటింగ్ కోసం బెంగళూరు వెళ్ళిన
సావిత్రి తన ఆస్తులన్నీ జప్తుచేసే నోటీసు వచ్చిందన్న'
విషయం తెలుసుకుంది. అప్పటికి రెండు మూడేళ్ళుగా
మందు మానేసిన సావిత్రి ఆ రోజు హోటల్లో తిరిగి తాగ
డం మొదలు పెట్టింది. దగ్గర ఎవరూ లేరు.
తాగడం మొదలు పెట్టిన తర్వాత ఇక ఆపడం తెలి
యలేదు. తెప్పించుకున్న ఆహారం తినలేదు. అప్పటికే
ఆమెకు ఇన్సులిన్ ఇంజెక్షన్ చేయించుకోవాల్సిన అవసరం
ఏర్పడింది. తనకు తానుగా ఇన్సులిన్ డోస్ తీసుకుం
టుండేది. కాని ఆరోజు ఆ ఇంజెక్షన్ తీసుకుందో లేదో
తెలియదు. తీసుకుంటే వెంటనే ఏదోకటి తినాలి. కొడుకు
సతీష్ బలవంతం చేస్తే బిస్కెట్ మాత్రం తిన్నది.
"మైసూరు నుండి బెంగళూరు మీదుగా మద్రాసు వెళ్ళే
టప్పుడు ఇక్కడ ఆగి ఒక కుక్క పిల్లను కొని తీసుకువెళ
దాం" అని కొడుకుతో చెపుతూ నిద్రలోకి జారుకుంది.
తెల్లవారింది. కాని ఆ మహానటి నిద్రలేవలేదు. నోటి
వెంట నురగ వస్తోంది. విషపుపురుగు కుట్టిందేమో అని
అనుకున్నారు. కాని ఆమె డయాబెటిక్ కోమాలోకి
వెళ్ళింది. ఇన్సులిన్ ఇంజెక్షన్ తీసుకుని ఆహారం తిననం
దున ఆమెకువచ్చిన ఇబ్బంది అది. 1980 మే 11న
కోమా
లోకి వెళ్ళిన మహానటి 1981 డిశంబరు 26న మరణించే
వరకు ఆమె పరిస్థితిలో ఏ మార్పులేదు.
ఎప్పుడైనా ఎవరైనా వెళితే కళ్ళు తెరచి చూసినా ఆమె
గుర్తుపట్టిందో లేదో తెలియని పరిస్థితి. ఆమెకు నచ్చిన
పాటలు వినిపిస్తే స్పందిస్తుందని అనుకుని ఆమె నటిం
చిన పాటలు వినిపించేవారు. 'దేవదాసు' సినిమాలోని
'కలయిదనీ... నిజమిదనీ... బ్రతుకింతేనులే' పాటకు
కొంచెం కదలిక చూపించేదంటారు.
బక్కచిక్కిపోయి, ఎముకలగూడులా మారిపోయిన
సావిత్రి, శరీరంలోని ఒక్కొక్క అంగం పనిచేయడం మానే
స్తుంటే ఆమె ఎప్పటికైనా కోలుకుంటుందేమోనన్న ఆశతో
గొట్టం ద్వారా ద్రవ ఆహార పదార్థాలను ఎక్కిస్తూ వైద్యులు
చెయ్యగలిగినదంతా చేశారు.
మహానటి సావిత్రి సినిమాలలో ఎన్నో పాత్రల ద్వారా
జీవితపోరాటం చేసింది.
కాని వ్యక్తిగత జీవితంలో మాత్రం
పోరాటం చెయ్యనంది. ఈ లోకం నుండి ఎంత త్వరగా
వెళ్ళిపోదామా అనే ప్రయత్నమే ఆమెది.
ఎన్నో రకాలుగా ఆమెను వేధించిన విధి చివరిలో
సహకరించిందేమో! కాని ఆమె చెప్పాలనుకుంటున్న
చివరిమాటలేవో చెప్పకుండానే వెళ్ళిపోయింది.